Tuesday, December 24, 2024

స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

ఒకనాడు బాబ్రీమసీదు ఉన్నచోటనే నేడు రామాలయాన్ని ప్రారంభిస్తున్న సందర్భం ఇది. భారత దేశం అధిక సంఖ్యాకుల విశ్వాసాలవైపు చాలా వేగంగా ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాటం నుంచి మనం ప్రయాణించి వచ్చిన మార్గాన్ని, విభిన్న విశ్వాసాలు కల దేశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో పల్లవిస్తున్న బలమైన హిందూత్వంపై లౌకికత్వం ఒక నిరసన వ్యక్తం చేస్తోంది. ‘దేశ విభజన జరిగినట్టయితే అవతలి వైపు ఉండే మైనారిటీల పరిస్థితి ఏమిటని మనం ఆలోచించాలి. కనుక మైనారిటీల హక్కుల్ని వాయిదా వేయాలి’ అని మహావీర్ త్యాగి అనే కాంగ్రెస్ సభ్యుడు 1947 మే ఒకటవ తేదీ జరిగిన రాజ్యాంగ సభలో కోరారు. దానికి అంబేద్కర్ సమాధానం చెపుతూ ‘మైనారిటీల హక్కులుకూడా హక్కులే. ఇతర దేశాల విధానాలననుసరించి మన దేశంలోని మైనారిటీలను బందీలుగా చూడకూడదు’ అని హితవు పలికారు. ‘రాజ్యాంగంలోని 18వ అధికరణంలో మైనారిటీలకు కల్పించిన హక్కులు ఎలాంటి మినహాయింపులు లేకుండా ప్రతి ఒక్క మైనారిటీకి వర్తిస్తాయని నేను భావిస్తున్నాను’ అన్న అంబేడ్కర్ చెప్పిన భావనతో వలస పాలనానంతర జీవితం ప్రారంభమైంది.

కాన్పూర్‌లో 1931లో జరిగిన మతఘర్షణల అనంతరం కరాచీలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక హక్కులపైన ముసాయిదా తయారు చేసింది. ప్రతి పౌరుడు తనకిష్టమైన మతాన్ని అనుసరించవచ్చని ఆ ముసాయిదా చెపుతోంది. తరువాత అదే సంవత్సరం మార్చి 31వ తేదీన కరాచీలో జరిగిన బహిరంగ సభలో గాంధీజీ ప్రాథమిక హక్కులను ప్రతిపాదించారు. ‘మనం సహనాన్ని పెంపొందించుకోవాలి. మతపరమైన తటస్థత చాల ముఖ్యం. హిందువులకు స్వరాజ్యం ఎంత ముఖ్యమో, ముస్లింలకు కూడా అంతేముఖ్యం. ఈ రోజు నుంచే రోజువారీ మన కార్యక్రమాల్లో ప్రభుత్వం తటస్థత పాటించాలనే సూత్రాన్ని స్వీకరిద్దాం’ అని గాంధీజీ ముగించాడు.మనకు లౌకిక, స్వతంత్ర భారత దేశాన్ని ప్రజాస్వామ్యమే అందించింది. కొంత మంది కవులు కలిసి 1936లో ‘ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్’ ను ఏర్పాటు చేసి, స్వాతంత్య్ర పోరాటాన్ని మరింత ఉత్తేజపరచడానికి అనేక గీతాలు రాశారు. ఈ రోజు మన దేశంలో హిందీ, ఉర్దూగా విభజన జరిగిపోయింది. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాన్నిచ్చిన మౌలానా హస్రత్ మొహానీని ఈ రోజు మనం మర్చిపోయాం. ఈ నినాదం స్వాతంత్య్ర పోరాటంలో జాతీయ గీతమై మోగింది.‘

ఆజాదీ ఏ కామిల్’ (సంపూర్ణ స్వాతంత్య్రం) అని ఆయన 1921లోనే కోరారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లు ఉరికంబాలెక్కడానికి వెళుతూ కూడా ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అన్ననినాదాలు చేశారు. ‘దుష్మనోంకా గోలియోంక హం సావ్‌ునా కరేంగే, ఆజాద్ హి రహేహై, ఆజాద్ హి రహేహై” (శత్రువు తుపాకీ తుటాకు ఎదురొడ్డి నిలబడతాం. స్వతంత్రులవుతున్నాం, స్వతంత్రులుగానే కొనసాగుతాం) అని చంద్రశేఖర్ ఆజాద్ రాశారు. ‘మేరా నారా, ఇంక్విలాబ్ ఓ ఇంక్విలాబ్’ (నానినాదం విప్లవం) అని జోష్ మలిహాబాది అనే విప్లవ కవి కూడా చైతన్యపరిచారు. హిందు ముస్లిం కవుల మధ్య తేడా ఎలా చూపించగలం? ఇరువురూ స్వాతంత్య్రాన్ని కోరుకున్నారు. ఇరువురూ అద్భుతమైన కవిత్వాన్ని రాశారు. ‘సాధారణ ప్రజలను పట్టించుకోకుండా ఖరీదైన భవనాల్లో నివసించలేం’ అని సజ్జద్ జహీర్ తన ఆత్మకథలో రాశారు.భారత దేశంలో ఫాసిస్టు వ్యతిరేక పవనాలు 1930లోనే వీచాయి. సమాజంలో అన్యాయానికి వ్యతిరేకంగా సాహితీ ఉద్దండులు నిలబడ్డారు.ద్విజాతి సిద్ధాంతంపై ఇస్లామిక్, హిందూత్వవాదులకు, అభ్యుదయ రచయితలకు మధ్య

భిన్నాభిప్రాయాలేర్పడ్డాయి.బిషావ్‌ు, బల్‌రాజ్‌సహాని, పృథ్వీరాజ్‌కపూర్, రాజ్‌కపూర్, షమ్మికపూర్, దేవానంద్ సహా అనేక మంది నటులు, జాన్ నిసార్ అక్తర్, సాహిర్ లుధియాన్వి, సర్దార్ జాఫ్రి వంటి కవులు 1946లో మతోన్మాదానికి, పేదరికానికి వ్యతిరేకంగా మాట్లాడారు. బొంబాయిలో ప్రదర్శన కూడా నిర్వహించారు.
భారత దేశం స్వాతంత్య్రానంతరం గాయపడి రెండుగా విభజితమైంది. స్వాతంత్య్రం కోసం విభజన అనే మూల్యం చెల్లించవలసి వచ్చింది. అనేక మంది అభ్యుదయ కవులు దేశ విభజనను వ్యతిరేకించారు. విభజనతో వారి హృదయాలు బరువెక్కాయి. పాకిస్తాన్‌కు వెళ్ళిపోవాలని భావించిన ఫరాజ్ అనే కవి ఇలా రాశాడు. ‘ఒక దేశాన్ని విభజించి పాకిస్తాన్‌ను సృష్టించినందుకా మనం ఉత్సవాల చేసుకుంటున్నది? స్వాతంత్య్రం, దేశ విభజన అనేవి 1947 ఆగస్టుకు రెండు ముఖాలవంటివి.ధ్వంసమైన కార్యక్షేత్రాలు, ప్రార్థనాలయాలు, ఇళ్ళశకలాల మధ్య ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రాయడం ఒక అద్భుతం. ప్రజాస్వామ్యంపై విశ్వాసాలు సడలిపోతున్న స్థితిలో స్వాతంత్య్రం ఒక నూతన శకాన్ని ప్రారంభించింది.

రాజ్యాంగ రచయితల ముందు ఒక అద్భుత మైన ధ్యేయముంది. భిన్నభాషలు, విలక్షణమైన ఆచారాలు, అనేక ప్రాపంచిక దృక్పథాలు, రాజకీయాల్లో భిన్నవ్యక్తీకరణలు ఉన్నాయి.ప్రజలు ఒకరికొకరు కొత్తగా కనిపిస్తున్నారు.దేశంలోని చాలా చోట్ల ప్రజాస్వామ్యం కూడా పరాయిదిగా అనిపిస్తోంది. రక్తపాతం, మారణహోమంతో పాటు స్వాత్యంత్య్ర వచ్చింది. సామాజిక అసమానతలు అలాగే ఉన్నాయి. మిగతా ప్రజలకంటే అధికులమనే భావన చదువుకున్న వారిలో ఏర్పడింది. క్షేత్ర స్థాయి నుంచి కుల, మత ప్రాతిపదికగా వివక్ష కొనసాగుతోంది. అభ్యుదయ కవులు సామరస్య భారతదేశాన్ని సృష్టించడం తమ కర్తవ్యంగా మరొకసారి భావించారు. మత సరిహద్దులకు అతీతంగా సమానత్వంపైన దృష్టి సారిస్తూ కవులు అనేక గేయాలు రాశారు. పి.ఎల్. సంతోషి దర్శకత్వంలో 1960లో వచ్చి ‘బర్సాకి రాత్’ సినిమాలో షాహిర్ లూధియాన్వి ‘ఏ ఇషాక్ ఇషాక్ హై ఇషాక్’ అంటూ కవ్వాలి పాట రాశారు. ఈ పాటలో ‘నువ్వు హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు ప్రేమ ఉచితం, దానిలోనే ధర్మం ఉంది నమ్ము’ బి.ఆర్ చోప్రా 1961లో తీసిన ‘ధర్మపుత్ర’ సినిమాలో రాసిన పాటకు అర్థం ‘నీవు కాబాలో నివసించినా, కాశీలో నివసించినా, నీవు రావ్‌ు అన్నా, రహీం అన్నా నీవు ఒక దేవుడికి చెందిన మనిషివి’.

సామాజిక ఒడంబడికగా రాజ్యాంగం

రాజ్యాంగం అనేది ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సామాజిక ఒడంబడిక లాంటిది. అది ప్రజల మధ్య కూడా సంబంధాలను ఏర్పాటు చేస్తుంది. మత రాజకీయాల వల్ల విడిపోయిన ప్రజలందరినీ ఒకే ప్రజాస్వామిక రాజకీయ వర్గంగా అది ఏర్పాటు చేసింది. కులం, మతం అనే అసహజమైన భయానికి ప్రత్యామ్నాయంగా విశ్వమానవులు, సంఘీభావం, స్నేహం అంటే ఏమిటో తెలియచెప్పింది. ‘భారత ప్రజలమైన మేము’ అంటే ప్రజలకే సార్వభౌమాధికారం అని రాజ్యాంగ ఉపోద్ఘాతంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రతిష్టించారు. సంఘీభావాన్ని సృష్టించడానికి వలసవాద వ్యతిరేక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని నిర్మించుకోకపోతే, స్వాతంత్య్రం కోసం ప్రజలంతా చేసిన పోరాటం నిరుపయోగమవుతుందని బ్రిజ్ నారాయణ్ చాక్‌బాస్ట్ అనే కవి హెచ్చరిస్తారు. సాటి పౌరులపట్ల మంచితనం వల్ల సామరస్యత ఏర్పడుతుంది. పౌరుల మధ్య ఉండే సంబంధాల వల్లనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఇతర వర్గాలను కూడా తమతో సమానమని భావించే పౌరుల ప్రవర్తనవల్లే అది సాధ్యమవుతుంది. ఈ నియమాల నుంచి ఏ మాత్రం వైదొలగినా, అతిక్రమించినా ప్రజాస్వామ్యానికి, లౌకికత్వానికి నష్టం జరుగుంది.

కాంగ్రెస్ నాయకులు స్వాతంత్య్రానికి పూర్వం లౌకికవాదం అనే పదాన్ని వాడారే కానీ, రాజ్యాంగ సభలో ప్రభుత్వ విధానంగా ఎప్పుడూ వారా పదాన్ని పలకలేదు. రాజ్యాంగం ఉపోద్ఘాతంలో లౌకికత్వాన్ని 1976 వరకు చేర్చలేదు.రాజ్యాంగ సభలో జరిగిన సుదీర్ఘ చర్చల్లో లౌకికత్వంపైన నిబద్ధత మాత్రం కనిపిస్తోంది. రాజ్యాంగ ఉపోద్ఘాతంలో ‘భగవంతుడి’ని చేర్చకూడదని రాజ్యాంగ సభలో జరిగిన సుదీర్ఘ చర్చల్లో అత్యధిక సభ్యులు కోరారు. ఉపోద్ఘాతంపై అక్టోబర్ 17, 1949న జరిగిన చర్చలో ‘భగవంతుని పేరుతో’ అన్నపదాన్ని చేర్చాలని హెచ్.వి. కామత్ సవరణను తీసుకొచ్చారు. షిబాన్ లాల్ సక్సేనా, మోహన్ లాల్ మాలవ్య వంటి వారు కూడా ఇలాంటి సవరణలనే ప్రతిపాదించారు. అత్యధిక సభ్యులు దీనికి అభ్యంతరం చెపుతూ, మతం అనేది వ్యక్తిగత ఎంపిక అని, అది మార్గనిర్దేశం కాదని స్పష్టం చేశారు. కామత్ పెట్టిన ప్రతిపాదన వీగిపోయింది. జాతి పునర్నిర్మాణంలో, ప్రజాస్వామ్యం, హక్కుల ప్రయోజనాల విషయంలో మతాన్ని దూరంగా పెట్టాలని 1948 నవంబర్ 23వ తేదీన కె.ఎం.మున్షి కోరారు. మతంపైన పూర్తి అదుపు ఉండాలని 1948 డిసెంబర్ 2వ తేదీన అంబేడ్కర్ పిలుపునిచ్చారు. విశ్వాసాలు,

ఉత్సవాల నిర్వహణ పరిమితిని దాటకుండా చూడాలని కోరారు. రాజ్యాంగ ఉపోద్ఘాతమంతా స్వాతంత్య్ర పోరాట ఆశయాలను ప్రతిబింబించింది. రాజ్యాంగాన్ని ప్రకటించిన 1950 జనవరి 26వ తేదీ గొప్ప ఆనందాన్ని నెరవేర్చిన రోజుగా మిగిలిపోయింది. స్వాతంత్య్రం కోసం పోరాడిన తరాల ఆలోచనలను రాజ్యాంగ ఉపోద్ఘాతం మూర్తీభవించింది. స్వాతం త్య్రం కోసం వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడకపోతే ప్రజలు దేని కోసం పోరాడినట్టు. భారత దేశం తన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన సమయంలో పొందిన ఆనందాన్ని మనం ఇప్పుడు కూడా పొందా లి. కోట్లాది మంది ప్రజలు పోరాడిన స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో రూపొందిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు యుద్ధానికి దిగే రాజకీయ పూర్వ కాలమనే అభిరుచి గల సమాజంలో జీవించడానికి మనం కొనసాగాలి. చరిత్ర నుంచి మనం గుణపాఠాలేమీ నేర్చుకోమా అని మనని మనం ప్రశ్నించుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News