Monday, December 23, 2024

రామ్ చరణ్ అద్భుతంగా నటించారు: ఫ్రెంచ్ హీరో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. ఈ సినిమా 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్ టిఆర్ నటించగా రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా వరించిన విషయం విధితమే.

ఈ మూవీలో రాంచరణ్ నటన అద్భుతంగా ఉందని  ఫ్రెంచ్ హీరో లూకాస్ బ్రావోప్రశంసిస్తూ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీంతో రాంచరణ్ అభిమానులు వైరల్ చేయడంతో ఆర్ఆర్ఆర్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎంట్రీ సీన్, భావోద్వేగంతో చరణ్ బాగా నటించారని కొనియాడారు. యాక్షన్ స్వీక్వెన్స్ లో బాగా నటించారని మెచ్చుకున్నారు.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ డబుల్ యాక్షన్ రోల్ నటిస్తున్నారు. చెర్రీకి తోడుగా కియారా అడ్వాణీ నటిస్తున్నారు. గేమ్ ఛేంజర్ లో నవీన్ చంద్ర, అంజలి, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, తదితరలు నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News