Friday, December 20, 2024

సెమీస్‌లో ఇగా, గాఫ్

- Advertisement -
- Advertisement -

పారిస్: ప్రతిష్ఠాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), మూడో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. పురుషుల విభాగంలో రెండో సీడ్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించాడు. పదో సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో జరిగిన పోరులో సిన్నర్ 62, 64, 76 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు.

ఆరంభం నుంచే సిన్నర్ ఆధిపత్యం చెలాయించాడు. తొలి రెండు సెట్లను ఎలాంటి ప్రతిఘటన లేకుండానే సొంతం చేసుకున్నాడు. మరోవైపు నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ) ప్రిక్వార్టర్ ఫైనల్ పోరులో అతి కష్టం మీద విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్ 60, 62 తేడాతో ఐదో సీడ్ మార్కెటా వొండ్రుసొవా (చెక్)ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన స్వియాటెక్ అలవోక విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లింది. మరో పోరులో గాఫ్ 46, 62, 63తో 8వ సీడ్ ఓన్స్ జాబేర్ (ట్యూనీషియా)ను ఓడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News