Monday, January 20, 2025

మట్టికోట మహారాణి స్వియాటెక్

- Advertisement -
- Advertisement -

వరుసగా మూడోసారి టైటిల్ కైవసం
ఫైనల్లో జాస్మిన్ పవ్‌లీనిపై ఘన విజయం
పారిస్ : ప్రపంచ నంబర్ 1 ఇగా స్వియాటెక్ సంచలనం సృష్టించింది. తనకు ఎంతో అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా మూడో ఛాంపియన్ అవతరించింది. దీంతో వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ నాలుగో టైటిల్ గెలుపొందిన టెన్నిస్ స్టార్ ఇగా నయా రికార్డునె నెలకొలిపింది. శనివారం టైటిల్ పోరలో ఇటలీకి చెందిన జాస్మిన్ పవ్‌లీనిపై వరుస సెట్లతో విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది స్వియాటెక్. ఆధ్యాంతం ఆధిపత్యం చెలాయించిన స్వియాటెక్ 6-2, 6-2తో పవ్‌లీనిపై సునయాస విజయాన్ని అందుకుంది. దాంతో, గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ చేరిన ప్రతిసారి ట్రోఫీ గెలిచిన మహిళా టెన్నిస్ స్టార్‌గా సయితం రికార్డు సృష్టించింది ఈ పోలాండ్ స్టార్. ఇప్పటివరకూ ఐదుసార్లు ఫైనల్ చేరిన స్వియాటెక్ ఐదింటా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో స్వియాటెక్ యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించింది. అదే ఆత్మవిశ్వాసంతో ఆమె మహారాణిగా అవతరించింది.
రెండో మహిళా టెన్నిస్ స్టార్‌గా
వరుసగా మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్వియాటెక్ మరో రికార్డు తన పేరిట లిఖించుకుంది. మహిళల టెన్నిస్‌లో ఈ ఘనత సాధించిన మహిళా టెన్నిస్ స్టార్‌గా ఆమె నిలిచింది. ఇంతకుముందు మాజీ వరల్డ్ నంబర్ 1 జస్టిన్ హెనిన్ 2005, 2006, 2007లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News