Wednesday, January 22, 2025

ల్యాండ్ జాబ్ స్కామ్.. తేజస్వీకి ఇడి కొత్త సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భూములకు ఉద్యోగాల కుంభకోణంలో బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర్టెరేట్ (ఇడి) తాజా సమన్లు వెలువరించింది. ఆయన విచారణకు జనవరి ఐదవ తేదీన తమ ముందు హాజరుకావాలని సమన్లలో తెలిపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇడి సమన్లను తేజస్వీ పెద్దగా పట్టించుకోవడం లేదు. నిజానికి ఆయన మొన్ననే ఇడి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ నోటీసు ఓ తంతు అని , వారు పిలుస్తుంటారు, తాము వెళ్లకుండా ఉంటామని తేల్చివేశారు.

కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు ఈ స్కామ్ జరిగిందని అభియోగాలు వెలువడ్డాయి. ఈ కేసుకు సంబంధించి లాలూను ఈ నెల 27న విచారణకు రావల్సిందిగా ఇడి ఆదేశించింది. 2004 నుంచి 2009 మధ్యకాలంలో కొందరికి అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వేలో డి కేటరిగి ఉద్యోగాలు కల్పించారని, ఈ క్రమంలో ముందుగా వారు తమ భూములను లాలూ కుటుంబ సభ్యుల పేరిట బదలాయించారని, ఈ మేరకు పత్రాలు వెలువడ్డాయని అభియోగాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News