Monday, December 23, 2024

బంగ్లాదేశ్ లో తాజా నిరసనలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి పదవికి షేఖ్ హసీనా రాజీనామా చేశాక తాజాగా 232 మంది అక్కడి హింసాకాండలో చనిపోయారు. గత 23 రోజుల్లో మొత్తం 560 మంది చనిపోయారు. ఇదిలావుండగా విద్యార్థులు తాజాగా అక్కడి హైకోర్టు భవనం ముందు నిరసనలు చేపట్టారు. ఢాఖాలోని కోర్టు ఆవరణలో సైన్యాన్ని దించారు. కాగా తమ డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తామని విద్యార్థులు తెలిపారు.

ఇదిలావుండగా ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో పరిస్థితిపై నిఘా పెట్టామని హోంమంత్రి అమిత్ షా ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు. ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ బంగ్లాదేశ్ లో హిందువులు, భారతీయుల రక్షణపై దృష్టిపెడుతోందన్నారు.

బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు కృషి చేస్తానని షేఖ్ హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ ‘రాయిటర్స్’ వార్తా సంస్థకు తెలిపారు. కాగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బిఎన్ పి)తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. గతం గత: అని భావిస్తానన్నారు. కాగా రాబోయే ఎన్నికల్లో ‘అవామీ లీగ్’ పోటీచేయగలదని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News