Monday, December 23, 2024

ఉక్రెయిన్ యుద్ధం- కాల్పులు, చావుల మధ్య తాజా చర్చలు

- Advertisement -
- Advertisement -

Russia attack
కీవ్: ఉక్రెయిన్, రష్యాల మధ్య నాల్గవ దఫా(రౌండ్) చర్చలు జరుగుతున్నాయని యుద్ధంలో దెబ్బతిన్న తూర్పు యూరొపియన్ దేశానికి చెందిన ఓ సంధానకర్త తెలిపారు. ఉక్రెయిన్ నగరాలు, ప్రాంతాలపై రష్యా భారీ కాల్పులు, బాంబులు చేస్తున్నప్పటికీ రెండు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. కైవ్ ప్రధాన సంధానకర్త మిఖైలో పోడోల్యాక్ మాట్లాడుతూ దేశం తక్షణ కాల్పుల విరమణను, ఉక్రెయిన్ నుండి రష్యన్ దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోందన్నారు. ‘శాంతి, తక్షణ కాల్పుల విరమణ, రష్యన్ దళాల ఉపసంహరణదీని తర్వాతే మేము ప్రాంతీయ సంబంధాలు, రాజకీయ విభేదాల గురించి మాట్లాడగలము’అని పోడోల్యాక్ ట్విట్టర్‌లో వీడియో ప్రకటన ద్వారా తెలిపారు.
తాజా చర్చలు ముట్టడిలో ఉన్న ఉక్రెయిన్ నగరాల నుండి పౌరులను ఖాళీ చేయడం, ఆహారం, నీరు, మందులు లేని ప్రాంతాలకు అత్యవసర సామాగ్రిని అందివ్వడంలో పురోగతి సాధించగలదన్న ఆశలు రేకెత్తించాయి. ఇదిలావుండగా కైవ్‌లోని విమాన కర్మాగారంపై రష్యా దళాలు దాడిచేయడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారని, ఏడుగురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అంటోనోవ్ కర్మాగారం ఉక్రెయిన్ అతి పెద్ద విమానాల తయారీ కర్మాగారం. ప్రపంచంలోని అనేక అతిపెద్ద కార్గో విమానాలను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి చెందింది. అంటోనోవ్ ఏవియేషన్ ఇండస్ట్రీ పార్క్ మంటల్లో చిక్కుకుంది.
మేరియుపోల్ నగరంలో పరిస్థితులు హృదయవిదారకంగా ఉన్నాయి. శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. దాదాపు 2,500 మంది మరణించి ఉంటారని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు ఒలేక్సీ అరెస్టోవిచ్ వెల్లడించారు. మేరియుపోల్‌కు చేరుకునే మానవతా సాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను కైవసం చేసుకునేందుకు రష్యా దాడులను ముమ్మరం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News