Wednesday, January 22, 2025

మణిపూర్‌లో మళ్లీ హింస

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో శుక్రవారం మరోసారి హింస చెలరేగింది. తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్ పట్టణంలో సాయుధులైన స్థానికులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. 20 మందికిపైగా గాయపడినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అక్కడ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులతో కూడిన భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు.

ఈ క్రమంలో టియర్ గ్యాస్ ప్రయోగించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నట్లు వారు పేర్కొన్నారు. కాగా, బుధవారం రోజున కూడా ఆ రాష్ట్రంలో హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగగ్చావో ఇఖాయ్‌లో కోఆర్డినేటింగ్ కమిటీ ఆఫ్ మణిపూర్ ఇంటిగ్రిటీ పిలుపు మేరకు వేలాది మంది ఆందోళనకారులు.. భద్రతా బలగాలు తమ జిల్లా వైపున ఏర్పాటు చేసిన బారికేడ్లను చురాచంద్‌పూర్ వైపునకు నెట్టేందుకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా ఆందోళనకారులకు గాయాలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News