Monday, December 23, 2024

మణిపూర్‌లో మళ్లీ హింస: 9 మంది గ్రామస్తుల మృతి

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లోని తూర్పు ఇంఫాల్ జిల్లాలో బుధవారం మళ్లీ హింసాకాండ చెలరేగింది. తీవ్రవాదులని అనుమానిస్తున్న కొందరు ఖమేలాక్ గ్రామంపై దాడి చేసి 9 మంది గ్రామస్తులను హతమార్చారు. మరో 25 మంది ఈ దాడిలో గాయపడ్డారు. తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. కాగా..అధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ ఘటనలో 11 మంది మరణించారు.

సాయుధులైన తీవ్రవాదులు ఖమేలాక్ గ్రామంపై మంగళవారం రాత్రి దాడి జరిపి గ్రమాస్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ కాఉ్పలలో 9 మంది గ్రామస్తులు అక్కడికక్కడే మరణించగా మరో 25 మంది గాయపడ్డారు. తీవ్రవాదులు కాల్పులు జరిపిన సమయంలో గ్రామస్తులు నిద్రిస్తుండడం, లేదా అప్పుడే భోజనం ముగించి ఉండడం జరిగిందని ఆ అధికారి చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News