Friday, December 20, 2024

మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగే తెలంగాణ మంచినీళ్ళ పండుగను ఘనంగా నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మిషన్ భగీరథ అధికారులకు ఆదేశించారు. గురువారం సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో మంత్రి మిషన్ భగిరథ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని అన్నారు.

ట్రీట్ మెంట్ ప్లాంట్ల ద్వారా రక్షిత మంచినీరు అందిస్తూ మహిళల నీటి కష్టాలు తీర్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని పేర్కొన్నారు.ఈ నెల 18న మంచినీళ్ళ పండుగ సందర్భంగా మహేశ్వరం ముచ్చర్ల గ్రామంతో పాటు, ట్రీట్ మెంట్ ప్లాంట్, వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాఘవపూర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల వద్ద జరిగే కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ చంద్రమౌళి, ఎస్ ఈ ఆంజనేయులు, ఈఈ రాజేశ్వర్, నర్సింలు గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News