Friday, January 17, 2025

శుక్రవారం రాశి ఫలాలు (17-01-2025)

- Advertisement -
- Advertisement -

మేషం: అనుకోని అవకాశాలు లభిస్తాయి. అన్ని విధాల అనుకూలమైన కాలం. ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగుతాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అవకాశాలు అప్రయత్నంగా లాభిస్తాయి.

వృషభం:  నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం లభిస్తుంది.

మిథునం: కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు లభిస్తాయి.  ఆర్థికపరమైన లావాదేవీలు కొంత నిరాశపరిచిన అవసరాలకు డబ్బు అందుతుంది.

కర్కాటకం: భాగస్వామి వ్యాపారాలు నిదానంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో స్వల్పమైన మార్పులు ఉంటాయి అనుకున్న పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.

సింహం: అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. సాంకేతిక విద్యలపై దృష్టిని సారిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి.

కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి ధన, వస్తు లాభాలను పొందుతారు. మీ పరపతి ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పనులలో తొందరపాటు వద్దు.

తుల:  వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాలలో మధ్యవర్తిత్వాలకు తావివ్వకండి. జీవితం ఒకే విధంగా సాగుతున్నట్లు భావిస్తారు. కొత్తదనాన్ని కోరుకుంటారు.

వృశ్చికం: ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తి తమ పనులను చక్కబెట్టుకునే వారిపట్ల జాగ్రత్త వహించండి.

ధనుస్సు: అనుకున్న పనులు కొంత జాప్యం మీద పూర్తిచేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఒకానొక కోరిక నెరవేరుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

మకరం:  సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు వహించండి.

కుంభం:  మీపై నిష్కారమైన వైరాన్ని ప్రదర్శిస్తున్న వారికి తగు సమాధానాలు చెప్పగలుగుతారు. కీలకమని  భావించిన వ్యవహారాలు సానుకూలపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మీనం: ఇతరులకు సంబంధించి మీ వద్ద ఉన్న వస్తు భద్రత పట్ల జాగ్రత్త వహించండి. సుదీర్ఘమైన ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. సహచరులను మిత్రులను సిబ్బందిని కార్యోన్ముఖులను చేయడానికి గాను అమితంగా శ్రమిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News