Monday, December 23, 2024

ఉమేష్ యాదవ్‌ను మోసం చేసిన స్నేహితుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్ తన స్నేహితుడికి నమ్మి ఉద్యోగం ఇస్తే తనని బురిడీ కొట్టించిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉమేష్ యాదవ్‌కు శైలేష్ ఠాక్రే స్నేహితుడిగా ఉన్నాడు. శైలేష్ ఉపాధి లేకపోవడంతో తన దగ్గర మేనేజర్‌గా ఉమేష్‌ను పెట్టుకున్నాడు. ఉమేష్ ఆర్థిక వ్యవహారాలు, బ్యాంక్ ఆకౌంట్లు, ఆదాయపన్ను లావాదేవీలు అని శైలేష్ చక్కదిద్దేవాడు. రూ.44 లక్షలకే భూమి ఇప్పిస్తానని చెప్పి శైలేష్ తన పేరున ప్లాట్ కొనుగోలు చేశాడు. దీంతో ఒక్కసారిగా ఉమేష్ షాక్ అయ్యాడు. నమ్మిన స్నేహితుడు మోసం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శైలేష్ పరారీలో ఉన్నాడు. ఉమేష్ యాదవ్ టీమిండియా తరఫున 54 టెస్టుల్లో 165 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టి20ల్లో 12 వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News