Friday, December 20, 2024

ప్రేమించిన అమ్మాయి దక్కదని… స్నేహితుడిని పార్టీకి పిలిచి హత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: ప్రేమించిన అమ్మాయి తన స్నేహితుడికి దక్కుతుందనే అనుమానంతో పార్టీకి పిలిచి హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎంజి యూనివర్సిటీలో నేనావత్ నవీన్(20), హరి(20) బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించడంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 17న పార్టీ ఉందని తన ఇంటికి అబ్దుల్‌పూర్‌మెట్‌కు నేనావత్ నవీన్‌ను హరి ఆహ్వానించాడు. ఇద్దరు మద్యం తాగిన తరువాత గొడవ జరగడంతో నవీన్ తన తండ్రికి ఫోన్ చేశాడు.

హరికి నవీన్ తండ్రి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. నవీన్ నుంచి ఫోన్ స్విఛ్చాప్ చేయడంతో పాటు కనిపించకపోవడంతో ఫిబ్రవరి 22న నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి హరి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఎక్కడ ఉన్న హరి లొంగిపోవాల్సిందిగా కోరారు. అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో హరి లొంగిపోయాడు. తన ప్రియురాలిని నవీన్ దక్కించుకుంటాడనే అనుమానంతో తాను హత్య చేశానని ఒప్పకున్నాడు. నవీన్ మృతదేహాన్ని హైదరాబాద్-విజయవాడ రహదారి పక్కన పడేశానని పోలీసులకు తెలిపాడు. హరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News