- Advertisement -
భోపాల్: యువతి పెళ్లికి నిరాకరించిందనిఆమెను కత్తితో పొడిచి అనంతరం యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖంద్వా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బబ్లూ అనే యువకుడు పక్కింట్లో ఉండే యువతిని గత కొంత కాలంగా వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు. తనని ప్రేమించాలని పలుమార్లు ఆమెను అతడు అడిగాడు. ఆమె కూడా పలుమార్లు నిరాకరించింది. ఒక రోజు యువతిని సీరియస్‌గా పెళ్లి చేసుకోవాలని యువకుడు అడిగాడు. కానీ ఆమె తిరస్కరించడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. యువతి ఇంట్లో ఎవరు లేని సమయంలో చొరబడి ఆమెను కత్తితో బబ్లూ పొడిచాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి పారిపోయి ఓ జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సదరు యువతి ప్రస్తుతం చికిత్స పొందుతుంది.
- Advertisement -