Monday, December 23, 2024

శాంతి భద్రతల పరి రక్షణలో పోలీసులు అద్భుతం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం విజయవంతంగా అమలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు ప్రజలకు అందిస్తున్న సేవలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, యువతకు అవగాహన కార్యక్రమం ఆదివారం నగరంలోని ఐఎంఎ హాల్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసు శాఖ పరిధిలో గతంలో ఉన్న పరిస్థితులకి, నేడు ఉన్న పరిస్థితులకి పొంతన లేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అద్భుత విజయం సాధించామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి శాంతిభద్రతల పరిరక్షణ మొదటి ప్రాధాన్యతగా గుర్తించిన ప్రభుత్వం పోలీసులకు వాహనాలు, మౌళిక సదుపాయాలు, ఆధునిక సాంకేతికతను అందిస్తూ బలోపేతం చేసిందని అన్నారు. మహిళలకు రక్షణ కోసం ప్రత్యేకంగా షీ-టీంలను ఏర్పాటు చేశామన్నారు. పోలీసింగ్‌లో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజలతో సత్సంబంధాలు కలిగి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలు జరిగితే త్వరితగతిన నేరస్తులను అరెస్ట్ చేస్తున్నామని అన్నారు.

ఫ్రెండ్లీ పోలీస్ అమలు చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ అద్భుతమైన సేవలు అందిస్తున్నారని, నిరంతరం వచ్చే సవాళ్లను ఎదుర్కొంటూ 24 గంటలు అప్రమత్తతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏ మూలన చిన్న సంఘటన జరిగిన సిసి కెమెరాల ద్వారా కనిపెట్టిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఒక చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలను తీసుకుంటూ పోలీసుల ఆత్మగౌరవం పెరిగే విధంగా ప్రభుత్వం సహకారం అందించిందన్నారు. పటిష్ట శాంతిభద్రతల కారణంగా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఏసీపీ అవినాష్ కుమార్ ,ఏసీపీ ప్రసన్న కుమార్, సిఐ శ్రీదర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News