Monday, December 23, 2024

భర్త, స్నేహితులతో కలిసి భార్యపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

 Friends and Hubby Gang rape on Wife in UP

లక్నో: తన భర్త, అతడి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేయడంతో అదనపు కట్నం తీసుకరావాలని వేధిస్తున్నారని ఆరోపణలతో భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఛకేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 2020 మార్చి 6న ఓ వ్యక్తి యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో భారీగా కట్న కానుకలు ఇచ్చారు. రెండు లక్షల రూపాయలు, కారు అదనంగా కట్నం కింద తీసుకరావాలని అత్త, భర్త చెల్లి, భర్త వేధిస్తున్నాడని ఆమె తెలిపింది. ఒక రూమ్‌లో ఉంచి లాక్ చేసి తనని చిత్ర హింసలకు గురి చేశారని తెలిపింది. ఒక రోజు తన భర్త, అతడి స్నేహితులతో కలిసి తనపై గ్యాంగ్ రేపు పాల్పడ్డాడని, పెట్రోల్ పోసి తగటబెట్టడానికి ప్రయత్నించాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీస్ అధికారి శైలేంద్ర సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News