Tuesday, January 21, 2025

వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి: పట్టణంలోని వాసవి క్లబ్ సేవ భవనంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు చిదిరె శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఒకరికొకరు ఫ్రెండ్‌షిప్ బ్యాండులు కట్టి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు చిదిరె శ్రీనివాసులు, ఇతర సభ్యులు మాట్లాడుతూ స్నేహ సంబంధాల గురించి, స్నేహం విలువ గురించి, కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వాళ్లు, అన్ని బంధాల కన్నా స్నేహ బంధం చాలా విలువైందని అన్నారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి అశోక్, మాజీ క్లబ్ అధ్యక్షులు జగదీశ్వర్, గోపాల్, ఎం. అశోక్, సత్యం, నరసింహ గుప్త, శ్రీనివాసులు, శ్రీధర్, కృష్ణయ్య, కిషన్ రాజు, ప్రభాకర్, జి. శ్రీనివాసులు, శోభన్ విజయ కుమార్, రఘు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News