Thursday, December 19, 2024

పాస్ వర్డ్ చెప్పలేదని చంపేశారు!

- Advertisement -
- Advertisement -

సరిగ్గా వాడితే సెల్ ఫోన్ వల్ల ఎన్నో లాభాలున్నాయి. కానీ,  సెల్ ఫోన్ వాడకం దుర్వ్యసనంగా మారితే మాత్రం కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారే ప్రమాదం లేకపోలేదు. పశ్చిమ బెంగాల్ లో అదే జరిగింది. సెల్ ఫోన్లో గేమ్స్ ఆడేందుకు అలవాటు పడిన నలుగురు వ్యక్తులు…  పాస్ వర్డ్ చెప్పలేదని 18 ఏళ్ల కుర్రాణ్ని  దారుణంగా హత్య చేశారు.

ముర్షీదాబాద్ లోని ఫరక్కా బ్యారేజీ సమీపంలో నివసించే పాపాయ్ దాస్ వయసు 18 ఏళ్లు. పదో తరగతి చదువుతున్నాడు. అతను తరచూ స్నేహితులతో కలసి ఆన్ లైన్లో గేమ్స్ ఆడేవాడు. ఇటీవల ఒకరోజు ఇంట్లోంచి బయటకు వెళ్లిన దాస్, మళ్లీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులకు సోమవారంనాడు ఫరక్కా సమీపంలో సగం కాలిపోయిన స్థితిలో దాస్ మృతదేహం కనిపించింది.

పోలీసుల విచారణలో అతని స్నేహితులే దాస్ ను హత్య చేసినట్లు తేలింది. మొబైల్ గేమ్ పాస్ వర్డ్ చెప్పమంటే దాస్ చెప్పనందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారట. దాస్ ను హత్య చేసి, అతని మృతదేహాన్ని తమ వాహనాల్లోని పెట్రోల్ సాయంతో కాల్చేశారు. మృతదేహంపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అతను తన కొడుకేనని దాస్ తల్లి గుర్తు పట్టింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News