Sunday, December 29, 2024

టీచర్ ను చంపిన స్నేహితులు

- Advertisement -
- Advertisement -

Law student brutally murdered in Meerut

లక్నో: టూర్‌కు సగం ఖర్చులు పెట్టుకోవడంలేదని ఓ టీచర్‌ను స్నేహితులు కొట్టి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్టం ఘజియాబాద్‌లో జరిగింది. బాఘ్‌పట్ ప్రాంతానికి చెందిన అదేశ్ త్యాగి అనే టీచర్ మురదానగర్‌లో నివసిస్తున్నాడు. మురదానగర్‌లో టీచర్‌కు సౌరబ్ సింగ్, నవరతన్ సింగ్, మోను కుమార్, గౌరవ్ కుమార్ అనే నలుగురు స్నేహితులు ఉన్నారు. నలుగురు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా రాజస్థాన్ టూర్ వెళ్దామని నిర్ణయం తీసుకున్నారు. టూర్ కు అయ్యే ఖర్చులో సగం డబ్బులు టీచర్ భరించాలని మిగిలిన ముగ్గురు అడిగారు.

తాను ఇవ్వనని చెప్పడంతో ముగ్గురు టీచర్‌తో గొడవకు దిగారు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ముగ్గురు పట్టుకోగా ఓ వ్యక్తి కర్రతో తలపై బాదాడు. అతడు అపస్మారకస్థితిలోకి పోవడంతో చనిపోయాడని భావించి మృతదేహాన్ని తీసుకెళ్లి అడవిలోని ఓ బావిలో పడేశారు. అడవి నుంచి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం ఆదేశ్‌గా గుర్తించి వెంటనే ఫోన్ కాల్ హిస్టరీ చెక్ చేయగా చివరలో నలుగురుతో మాట్లాడినట్టుగా గుర్తించారు. వెంటనే పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. తప్పించుకున్న ఒకరి గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News