Friday, December 27, 2024

రైతు నేస్తాలు ఆరుద్ర

- Advertisement -
- Advertisement -

కాసిపేట:ఆరుద్రలో కనిపించే అరుదైన ఆరుద్రను రైతు నేస్తాలుగా అభివర్ణిస్తారు. నక్షత్రంలో ఆరుద్రకు ఆరవ స్థానం కాగా వ్యవసాయం మొదలు ఆరుద్ర కార్తీతోనే మొదలు అవుతుంది. ఆరుద్రను కొన్ని ప్రాంతాలలో కొన్ని పేర్లుగా పిలుచుకుంటారు. ఆరుద్ర ఎరుపు రంగులో అందంగా కనిపిస్తుంది, గిరిజనులు గౌరిగావిడిగా అభివర్ణిస్తు లక్ష్మీదేవిగా పూజిస్తారు.

ఆరుద్ర ఏడాదిలో ఒక్క సారి మాత్రమే కనిపిస్తుంది. ఆరుద్ర వ్యవసాయా రంగానికి ఎలాంటి హాని చేయదని రైతులు అంటున్నారు. ఆరుద్ర వలన వ్యవసాయానికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయని వారు అన్నారు. పంటలకు పోషకాలు అందించి, నేలను సారవంతం చేస్తుందని, భూసారం పెంచుతుందని రైతులు అంటున్నారు.

తొలకరిలోఆరుద్ర కనిపిస్తే వ్యవసాయానికి శుభసూచికమని, వర్షాలు కురస్తాయని అంటున్నారు. ఆరుద్ర భూమిలో 40 అడుగుల లోతు వరకు ఉంటాయాని, ఇసుకలో కూడా జీవిస్తాయని, ఇవి కేవలం ఆరుద్ర కార్తీలోనే దర్శనం ఇస్తాయని, ఆరుద్ర కనిపించగానే వ్యవసాయ పనులు మొదలు పెట్టడం జరుగుతుందని రైతులు తెలిపారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆరుద్ర పురుగులు దర్శనం ఇస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News