Thursday, December 19, 2024

సోషల్ మీడియాలో స్నేహం… యువతిని అడవిలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

భోపాల్: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను అడివిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమెను అక్కడి నుంచి మరో రాష్ట్రానికి తీసుకెళ్లి ఆమెపై మూడు రోజుల పాటు అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇన్‌స్టాగ్రామ్‌లో సదరు యువతికి గోల్దీ, షారూఖ్, అనురాగ్ అనే స్నేహితులు ఉన్నారు. స్మార్ట్‌ఫోన్‌లో ముగ్గురితో కలిసి చాటింగ్ చేసేది. డిసెంబర్ 21 సాయంత్రం 4 గంటలకు పాఠశాలు నుంచి ఇంటికి వెళ్లటానికి జామ్నియా రోడ్డులో యువతి బస్సు కోసం ఎదురుచూస్తుంది.

ఆమె స్నేహితులు హరీష్, అనురాగ్ బైక్‌పై వచ్చి ఆమెతో మాట్లాడారు. ఇద్దరు ఆమెను బైక్‌పై అడవిలోకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ షారూక్, గోల్దీ ఉన్నారు. విద్యార్థినిపై గోల్డీ, షారూక్‌లు అత్యాచారం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గోల్డీ బైక్‌పై తిరుగొచ్చి ఆమెను బస్సులో మహారాష్ట్రకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ చెరుకు తోటలో ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడు. బాధితురాలు ఇంటికి వెళ్లాలని గొడవ చేయడంతో మహారాష్ట్ర నుంచి ఖాండ్వాకు వెళ్లే బస్సులో ఎక్కించారు. బాధితురాలు ఇంటికి చేరుకున్న తరువాత తన తండ్రికి విషయం చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News