Monday, November 25, 2024

అదానీతో దోస్తీ… అసలు మతలబేంటి?

- Advertisement -
- Advertisement -

నాడు నిప్పులు.. నేడు పువ్వులా? సిఎంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సూచించారు కాంగ్రెస్ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎ స్ పార్టీ మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం గురువారం జరిగింది. సభకు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివా స్‌గౌడ్, లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్‌లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎంపి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, మాజీ ఎంఎల్‌సిలు, జెడ్‌పి చైర్మన్లు, మాజీ చైర్మన్లు, ము న్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, పార్టీ జిల్లా శాఖ ల అధ్యక్షులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ మొన్నటివరకు ప్రధాని, అదానీ ఒకటే అని రేవంత్‌రెడ్డి మాట్లాడారని, దావోస్ సాక్షిగా అదానీతో అలయ్ బలయ్ చే సుకున్నారన్నారు. బిజెపి ఆదేశాల మేరకు అదానీతో రేవంత్‌రె డ్డి కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో అదానీతో పో రాడుతున్న కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు కలిసి పని చేస్తోందని ప్రశ్నించారు. మోడీ, అదానీ ఒక్కటేనని రాహుల్ గాంధీ అంటారని, రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి హోదాలో కాం గ్రెస్ జాతీయ శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ, అదానీ ఒక్కటే అని  అన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దావోస్‌లో ఆయనతో ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇది అవకాశవాద, నీచ స్థాయి రాజకీయమని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత అదానీ పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు ఏంటని కెటిఆర్ పశ్నించారు. అదానీ గ్రూప్ రాష్ట్రంలో పలు వ్యాపారాలలో రూ.12400 కోట్ల పెట్టుబడులను ప్రకటించిన నేపథ్యంలో కెటిఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాం గ్రెస్ పార్టీలు అనేక హామీలు ఇచ్చిందని, కానీ వాటిని నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు.

ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని, కాంగ్రెస్ 420 హామీలను ప్రజలకు ఎప్పు డూ గుర్తు చేయాలన్నారు. రూ.2లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారని, ఇప్పుడు రుణమాఫీ దశలవారీగా చేస్తామని వ్యవసాయ మంత్రి అంటున్నారని గుర్తు చేశారు. ఎరువుల కో సం రైతులు లైన్‌లో నిలబడే పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నా రు.బిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు కాదు, ఆస్తులు సృష్టించిందన్నా రు. బం గారు పళ్లెంలో పెట్టి తెలంగాణను కాంగ్రెస్‌కు అప్పగించామన్నారు.
కెసిఆర్ మహబూబ్‌నగర్ ఎంపిగా ఉన్నప్పుడే తెలంగాణ కల సాకారమైంది : మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
2009 ,2014 ,2019 లలో వరసగా మూడు సార్లు మహబూబ్ నగర్ ఎంపీ సీటును బిఆర్‌ఎస్ గెలుచుకుందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. 2009 లో కెసిఆర్ మహబూబ్ నగర్ ఎంపిగా ఉన్నపుడే తెలంగాణ కల సాకారమైందని వెల్లడించారు. పార్లమెంటులో తెలంగాణ గొంతుక బలంగా వినబడాలంటే బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థులు గెలవాలన్నారు. గత రెండు లోక్ సభల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఎంపీలే కాంగ్రెస్, బిజెపి ఎంపిల కన్నా ఎక్కువ ప్రశ్నలు అడిగారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హామీలతో ప్రజలు మోసపోయారని, ప్రజలందరూ ఇపుడు ఆలోచన చేస్తున్నారని, మన కండ్లు మనమే పొడుచుకున్నాం అని ప్రజలు బాధ పడుతున్నారన్నారు.

కనీసం పార్లమెంటు ఎన్నికల కోసమైనా కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న అమలు చేస్తామన్న హామీలు అమలు చేస్తారో చూడాలన్నారు. కెసిఆర్ హాయం లో చెప్పినవి, చెప్పనవి కూడా చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు మహిళలు అందరూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కులు పాతవి ఇస్తున్నారని, మరి అదనంగా ఇస్తామన్న తులం బంగారం ఏదీ? అని ప్రశ్నించారు. రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఏమైం ది ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగడుతూ ప్రజలను ఎప్పటికపుడు అప్రమత్తం చేయాలనీ నిర్ణయించామని వెల్లడించారు. లోక్ సభ అభ్యర్థులను కెసిఆర్ అన్నీ ఆలోచించి ఖరారు చేస్తారన్నారు. సన్నాహక సమావేశాలు ముగిశాక తమ తదుపరి కార్యాచరణను కెసిఆర్ నిర్ణయిస్తారన్నారు. పార్టీ నిర్ణయాలకు అందరూ కట్టుబడాల్సిందేనని, తమది క్రమ శిక్షణ గల పార్టీ అని అన్నారు. 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News