Monday, December 23, 2024

ఈనెల 24వ తేదీ నుంచి రెండో విడుత ఎంసెట్ కౌన్సిలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ ఇంజినీరింగ్ రెండో విడుత కౌన్సెలింగ్ ఈ నెల 24 నుంచి ప్రారంభమైతునందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి విడుత కౌన్సెలింగ్ పూర్తి చేసి విద్యార్థులకు సీట్లు కేటాయించి సెల్ఫ్ రిపోర్టింగ్‌కు ఈనెల 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దీంతో ఈ నెల 24 నుంచి రెండో విడుత కౌన్సెలింగ్ ప్రారంభం కానుందని విద్యార్థులు ఈ నెల 24, 25 తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా తమ సమాచారాన్ని పొందుపరిచి, ప్రాసెసింగ్ ఫీజును చెల్లించి, ప్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 26న ధృవపత్రాల పరిశీలన 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 27న సీట్లను ఫ్రీజ్ చేయనుండగా, ఈ నెల 31వ సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 31 నుంచి ఆగస్టు 2 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేయడంతో పాటు, ట్యూషన్ ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. మొదటి విడుత కౌన్సెలింగ్‌లో మొత్తం 173 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 82,666 సీట్లుండగా, 70,665 సీట్లు కేటాయించారు. మరో 12,001 సీటు మిగిలి ఉండగా, వీటిని రెండో విడుత కౌన్సిలింగ్ భర్తీచేస్తారు. అంతేకాకుండా మొదటి విడుతలో సీట్లు పొందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించకుంటే సీట్లు రద్దు చేసి ఆసీట్లను రెండో విడుత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News