Wednesday, January 22, 2025

నాడు బిచ్చగత్తె..నేడు ఆన్‌లైన్ ఇంగ్లీష్ ట్యూటర్(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: తమిళపాడే నాధాపి చెన్నై వీధులలో బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక 81 ఏళ్ల వృద్ధ మహిళ ఇప్పుడు ఇంగ్లీష్ ట్యూటర్‌గా మారిపోయింది. ఆమెను ఈ విధంగా మార్చిన ఘనత మొహమ్మద్ ఆషిక్ అనే కంటెంట్ క్రియేటర్‌కు దక్కుతుంది.

ఒకరోజు..చెన్నై వీధులలో బిక్షగత్తెగా కనిపించిన ఒక వృద్ధురాలు ఇంగ్లీష్‌లో ధారాళంగా మాట్లాడడం చూసి ఆషిక్ ఆశ్చర్యపోయాడు. ఆమె గురించి ఆరా తీశాడు. తన పేరు మెర్లిన్ అని చెప్పిన ఆ వృద్ధురాలు తన స్వస్థలం మయన్మార్(ఒకప్పటి బర్మా)గా తెలిపింది. ఒక భారతీయుడిని వివాహం చేసుకుని చెన్నై వచ్చేశానని ఆమె చెప్పింది. తన కుటుంబ సభ్యులందరూ మరణించడంతో తాను ఒంటరిగా, మరో దిక్కులేక బిక్షమెత్తుకుని జీవిస్తున్నానని ఆమె తన దీనగాథను ఆషిక్‌కు వివరించింది.

తాను గతంలో మయన్మార్‌లో ఉన్నపుడు స్కూలులో ఇంగ్లీష్ బోధించేదాన్నని ఆమె చెప్పడంతో ఆషిక్‌కు వినూత్న ఆలోచన కలిగింది. వెంటనే ఆమెకు ఒక కొత్త చీరను బహుకరించిన ఆషిక్ ఆమెను ఆన్‌లైన ఇంగ్లీష్ టీచర్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లీష్ విత్ మార్లిన్ పేరుతో ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను కూడా క్రియేట్ చేశాడు. ప్రస్తుతం మార్లిన్ ఆన్‌లైన్‌లో ఇంగ్లీష్ ట్యూటర్‌గా పాఠాలు చెబుతూ గౌరవప్రదమైన జీవితాన్ని సాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News