Wednesday, January 22, 2025

భీవండి నుండి బిఆర్‌ఎస్‌లోకి చేరికలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీలో మహారాష్ట నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. భీవండి నుంచి కాంగ్రెస్, ఎన్‌సిపి పార్టీలకు చెందిన పలువురు నాయకులు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో ఆదివారం నాడు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరికి అధినేత గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఎన్‌సిపి మైనార్టీ సెల్ జాతీయ కార్యదర్శి అరిఫ్ అజ్మీ, ఫజిల్ అన్సారీ, భీవండి కాంగ్రెస్ నేత, సామాజిక కార్యకర్త ఇర్ఫాన్ మోమిన్, కాంగ్రెస్ నేత, ఎన్‌జిఒ సీనియర్ నాయకుడు అర్ఫత్ షేక్, ఎన్‌సిపి థానే జిల్లా ఉపాధ్యక్షుడు మక్సూద్ ఖాన్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ ఎ.జీవన్ రెడ్డి, మహారాష్ట బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News