Thursday, January 23, 2025

సైరస్‌పై వేటు ఇప్పటికీ మిస్టరీనే..

- Advertisement -
- Advertisement -

From Mistry's appointment as Chairman till his death

గౌరవం కోసం పోరాడిన ఏకైక వారసుడు
తొలగింపు సుదీర్ఘ న్యాయ పోరాటం

న్యూఢిల్లీ : టాటా సన్స్‌కు సైరస్ మిస్త్రీ చైర్మన్‌గా నియామకం నుంచి ఆయన మరణం వరకు అంతా మిస్టరీగానే మిగిలింది. టాటా సన్స్‌కు చైర్మన్‌గా నియమించేంత వరకు సైరస్ మిస్త్రీ ఎవరో చాలామందికి తెలియదు, అప్పటి వరకు ఆయన కుటుంబ వ్యాపారంతోనే సంబంధం కల్గివున్నారు. అప్పటికే ఆ దక్షిణ ముంబై యువకుడు, మిస్త్రీ కుటుంబ వారసుడు షాపూర్జీ పల్లోంజి గ్రూప్‌లోని కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు బహుళ వ్యాపారాలు కల్గిన 100 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న రతన్ టాటా పదవీవిరమణ చేసిన తర్వాత 2012లో టాటా వారసుడిగా సైరస్ నియమితులయ్యారు. నివేదిక ప్రకారం, 44 ఏళ్ల మిస్త్రీ ఆ సమయంలో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఇష్టపడలేదు, కానీ రతన్ టాటానే స్వయంగా ఆయన పేరును ప్రస్తావించడంతో అంగీకరించక తప్పలేదు. అనంతరం నాలుగేళ్ల తర్వాత 2016 అక్టోబర్‌లో బోర్డురూమ్ తిరుగుబాటులో మిస్త్రీని తొలగించగా, మళ్లీ రతన్ టాటానే బాధ్యతలు చేపట్టారు.

ఎన్.చంద్రశేఖరన్‌కు బాధ్యతలు అప్పగించిన తర్వాత రతన్ టాటా తప్పుకున్నారు. ఆ తర్వాత మిస్త్రీ తండ్రి పల్లోంజి మిస్త్రీ టాటా సన్స్ బోర్డుకు దూరంగా ఉండడం, వివాదం పెద్దది కావడం జరిగాయి. ఈ వివాదం కోర్టుకు వెళ్లింది. ఇరువర్గాలు న్యాయ పోరాటం చేశాయి. ఎన్‌సిఎల్‌టి మిస్త్రి పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ తర్వాత మిస్త్రీ ఎన్‌సిఎల్‌ఎటిని ఆశ్రయించగా టాటా గ్రూప్ చైర్మన్‌గా తిరిగి నియమించింది. దీనిని సవాల్ చేస్తూ టాటా గ్రూప్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్టు టాటా సంస్థ నిర్ణయాన్ని సమర్థించగా, సైరస్ రివ్యూ పిటిషన్‌ను 2021లో కొట్టివేసింది. అయితే సైరస్‌ను టాటా గ్రూప్ అకస్మాత్తుగా ఎందుకు తొలగించిందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. టాటా సన్స్‌లో 18.5 శాతం వాటాను కల్గివున్న మిస్త్రీ కుటుంబం తన మొత్తం వాటాను ఆఫ్‌లోడ్ చేయాలని ప్రతిపాదించింది. పల్లోంజీ మిస్త్రీ గ్రూప్ వ్యాపారం దుస్తుల నుండి రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, వ్యాపార ఆటోమేషన్ వరకు విస్తరించి ఉన్నాయి. పల్లోంజీ మిస్త్రీ ఆస్తుల విలువ 15.7 బిలియన్ డాలర్లు ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News