Saturday, November 23, 2024

ఉగాది తర్వాత ‘పోరు ఉధృతం’

- Advertisement -
- Advertisement -

From obligation to purchase Paddy grain center is escaping

ఏప్రిల్ 1నాటికే గ్రామ పంచాయతీలు, మండలాలు, జడ్‌పిల తీర్మానాలు ప్రధానికి పంపుతాం

వడ్ల కొనుగోలు బాధ్యత నుంచి
కేంద్రం తప్పించుకోజుస్తోంది
ఇది రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధం
యాసంగి వడ్లు మిల్లింగ్ చేస్తే
నూకలు ఎక్కువగా వస్తాయి
ఉప్పుడు బియ్యం కొనకపోతే
నేరుగా వడ్లనే తీసుకొని
కేంద్రమే మిల్లింగ్ చేసుకోవాలి
పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌కు
అవసరమైన వ్యవసాయ
ఉత్పత్తులను కేంద్రం
ప్రోత్సహించడం లేదు రాష్ట్ర
మంత్రులను పనివాళ్లుగా
చూస్తున్న కేంద్రం క్షమాపణలు
కోరే పరిస్థితిని తెస్తాం :
టిఆర్‌ఎస్ భవన్‌లో మీడియాతో మంత్రులు నిరంజన్ రెడ్డి,
గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్

మన : యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏప్రి ల్ 2వ తేదీలోగా కేంద్రం ఉత్తర్వులు ఇవ్వాలని, లేకపోతే కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఉగాది తర్వాత ఉద్ధృతమైన ఆందోళనలు చేస్తామని మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ భవన్‌లో శనివారం మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు మండిపడ్డారు. కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ నూకలు తినాలన్న వ్యాఖ్యలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర మంత్రులను అవహేళన చేస్తూ మాట్లాడారని వారు మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులను పనివాళ్లుగా చూసే ధోరణి దుర్మార్గమన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వారు తెలిపారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం క్షమాపణలు కోరే పరిస్థితిని తీసుకొస్తామని వారు పేర్కొన్నారు.

బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కేంద్రం చేయడం లేదని మంత్రులు ఆరోపించారు. ఈ విషయంలో రా ష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కనీసం కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తేవడం లేదని వారు ప్రశ్నించారు. మార్పులు సూచిస్తే స్వీకరించే ఔదార్యం కూడా కేంద్ర మంత్రులకు లేదని వారు విమర్శించారు. కేంద్రమంత్రుల అవగాహన రాహిత్యాన్ని ప్రజలు సహించరని, వరి సాగు చేయండని, రైతులను రెచ్చగొట్టిన బిజెపి నాయకులు ఇప్పుడెందుకు కేంద్రాన్ని అడగ డం లేదని వారు ప్రశ్నించారు. తెలంగాణలో యాసంగి వడ్లు మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువగా వస్తాయని, బాయిల్డ్ రైస్ కొనకపోతే ధా న్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని, ధా న్యం కొని కేంద్రమే మిల్లింగ్ చేసుకోవాలని వారు సూచించారు. రైతుల సమస్యను పరిష్కరించలేని కేంద్ర ప్రభుత్వం ఎందుకు?, తెలంగాణ రైతుల కోసమైనా కేంద్రాన్ని కిషన్‌రెడ్డి అడగవచ్చు కదా, యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని ఇదే బిజెపి నాయకులు అనలేదా? యూపిఏను విమర్శించిన బిజెపి నాయకులు ఈరోజు అదే ధోరణిలో వెళుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి తీసుకెళ్లాలన్న కేంద్రం లక్ష్యాన్ని వారు విమర్శించారు. ఇథనాల్ తయారీకి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం లేదన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ కాదా !

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ కాదా ? ప్రజలకు రైతులకు అన్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి వంత పాడడం అనైతికమన్నారు. ప్రతి నెలా 10 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తామని 16 లేఖలు రాసినా రాకులు లేవని గోదాములు ఖాళీ లేవని కేంద్రం తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ అంశాలపై కేంద్ర మంత్రిని ఐదుసార్లు రాష్ట్ర మంత్రుల బృందం కలిసిందని, ప్రతిసారీ అవహేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడారని వారు దుయ్యబట్టారు. కేరళలో రెండున్నర లక్షల మెట్రిక్ టన్నులకు, కర్ణాటకలోని పన్నెండు వేల మెట్రిక్ టన్నులకు, తెలంగాణలోని 60 లక్షల మెట్రిక్ టన్నులకు ఒకే రకంగా మూడు నెలల గడువు ఇవ్వడం ఎలా సమంజసమని వారు ప్రశ్నించారు. సిఎం కెసిఆర్, టిఆర్‌ఎస్ పార్టీ ఉన్నంత వరకు తెలంగాణ రైతులు భయపడాల్సిన అవసరం లేదని మంత్రులు అభయమి చ్చారు. తెలంగాణను అవమానించి, అవహేళన చేసిన ఎందరో రాజకీయ భవిష్యత్ లేకుండా పోయారని వారు పేర్కొన్నారు. సిఎం ఆదేశాల మేరకు ఏప్రిల్ 01వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జెడ్పీలలో కేంద్రం వడ్లు కొనాలని తీర్మానాలు చేసి ప్రధానికి పంపుతామని మంత్రులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News