Sunday, December 22, 2024

3 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు!

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు ప్రస్తుతం ప్రయాణం ఐదు నుంచి ఆరున్నర గంటల సమయం పడుతుంది. జన్మభూమి సూపర్‌ఫాస్ట్.. అలాగే గోల్కండ, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు లాంటివి ఈ రూట్‌లో తిరుగుతున్నాయి. అలాగే తెల్లారుజామున పరుగులుపెట్టే ట్రైన్‌ అయితే 4 గంటల సమయం పడుతుంది. త్వరలోనే ఈ ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. సికింద్రాబాద్-గుంటూరు రూట్‌లో నల్లపాడు-బీబీనగర్ మధ్య 248 కిమీ మేర 2వ రైల్వే లైన్ నిర్మాణం, విద్యుదీకరణ పనులు పట్టాలెక్కాయి. సుమారు రూ.2853 కోట్ల ఈ ప్రాజెక్టును 4 దశల్లో పూర్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగష్టులో పనులు ప్రారంభం కానున్నాయి.

ప్రాజెక్ట్ పూర్తయితే 3 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోనున్నాయి రైళ్లు. ఈ రూట్ మధ్య ప్రస్తుతం సింగిల్ రైల్వే లైన్ ఉండటం వల్ల ఒక రైలు వస్తుంటే.. మరొకటి స్టేషన్‌లో ఆగాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ రూట్‌లో డబుల్ లైన్ అందుబాటులోకి వస్తే.. ఇక సికింద్రాబాద్ నుంచి గుంటూరు రెండున్నర నుంచి మూడు గంటలు సమయం పట్టే ఛాన్స్ ఉంటుంది.

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News