Wednesday, January 22, 2025

సచివాలయం నుంచే శ్రీకారం …

- Advertisement -
- Advertisement -

ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు కార్యాచరణ
ఉద్యోగ సంఘాలతో సిఎస్ భేటీ

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శనివారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై జరిగిన సదస్సులో భాగంగా వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, నాయకులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సచివాలయంగా తీర్చిదిద్దేందుకు అన్ని విభాగాల ఉద్యోగులు సహకరించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఇపిటిఆర్‌ఐ డైరెక్టర్ జనరల్ వాణీ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్యతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News