Monday, January 20, 2025

వక్ఫ్ స్థలంలో ఫ్రూట్ మార్కెట్?

- Advertisement -
- Advertisement -


మన తెలంగాణ / హైదరాబాద్ : వక్ఫ్ స్థలంలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగర శివార్లలోని మామిడిపల్లి లోని పహాడీషరీఫ్ దర్గాకు సంబంధించిన స్థలంలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. వక్ఫ్‌బోర్డు కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మునీరుద్దీన్ నేతృత్వంలో ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ మంగళవారం వక్ఫ్‌బోర్డు చైర్మన్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పహాడీషరీఫ్ దర్గాకు చెందిన 16 ఎకరాల స్థలాన్ని ఫ్రూట్ మార్కెట్ కు లీజుకు ఇవ్వాలని అసోసియేషన్ కోరుతోంది. ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఓవైసి గత శాసనసభ సమావేశాల్లో ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వక్ఫ్ స్థలాన్ని ఫ్రూట్ మార్కెట్ కోసం ఇవ్వాలని ఆయన కోరారు.

ఈ విషయంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోండది. దరిమిలా అసోసియేషన్ నేతలు నేడు చైర్మన్‌ను కలిశారు. అయితే దీనిపై వక్ఫ్ ఆక్టివిస్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ భూమి దేనికి ఉద్దేశించబడింతో దానికే ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. నిర్దేశించిన ప్రకారం వక్ఫ్‌భూమిని లీజుకు ఇవ్వడానికి ఎలాంటి ఆటంకాలు లేకపోతే మార్కెట్ ధర ప్రకారం దానికి లీజుకు ఇవ్వాలని సేవ్ వక్ఫ్ ప్రాపర్టీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇఫ్తెఖార్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఆ ప్రాపర్టీ వక్ఫ్ నిబంధనల ప్రకారం వీలు కానిచో దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు ఇవ్వరాదని ఆయన కోరారు. అయితే ఈ విషయంలో వక్ఫ్‌బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News