Monday, January 27, 2025

వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది!

- Advertisement -
- Advertisement -

క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి పేరు వినగానే మరణమే మనకు గుర్తుకు వస్తుంది. అయితే మనం ఆహారంలో తగిన కొన్ని ఆరోగ్యకరమైన వాటిని తీసుకుంటే క్యాన్సర్ ముప్పు చాలా వరకు తగ్గుతుంది. ఈ క్రమంలో మనం ఈరోజు కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. వీటిని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

 

క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడే పండ్లు

1. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, బ్లాక్బెర్రీ

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్, యాంథోసైనిన్, ఎలాజిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి క్యాన్సర్ నివారించడంలో సహాయపడతాయి.

2. నారింజ, నిమ్మ, ద్రాక్ష

ఈ పండ్లలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, లిమోనాయిడ్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా కాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

3. దానిమ్మ

ఇందులో ఎల్లాజిక్ యాసిడ్, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పరిగణిస్తారు.

4. బొప్పాయి

ఈ పండులో బీటా-కెరోటిన్, లైకోపీన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News