Saturday, December 21, 2024

ఎంఎల్ఎ శ్రీధర్‌బాబు ఫొటోతో ఉన్న గడియారాల పట్టివేత

- Advertisement -
- Advertisement -

మంథని : మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్‌బాబు ఫొటోతో ఉన్న గోడ గడియారాలను తరలిస్తున్న వ్యాన్‌ను ఎఫ్‌ఎస్‌టి అధికారుల బృందం బుధవారం అర్థరాత్రి పట్టుకుంది. మంథనిలోని పాత పెట్రోల్ పంపు సమీపంలో నలుగురు సభ్యుల ఎఫ్‌ఎస్‌టి బృందం అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఎపి01వై2700 గల డిసిఎం వ్యాన్‌లో తని ఖీలు నిర్వహించగా, శ్రీధర్‌బాబు ఫొటోతో ముద్రించిన గోడ గడియారాలు లభ్యమయ్యాయి. సుమారు రూ.లక్షా96వేల విలువగల వస్తువులను స్వాధీనం చేసుకొని, వాహనాన్ని సీజ్ చేసి ఎన్నికల అధికారి హనుమనాయక్‌కు సమాచారం ఇవ్వగా, ఆయన ఆదేశాల మేరకు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎఫ్‌ఎస్‌టి ఇన్‌చార్జి ఫిర్యాదు మేరకు గోడగడియారాలు తరలిస్తున్న వ్యాన్ డ్రైవర్ అనంతుల రమేష్‌పై కేసు నమోదు చేయడంతోపాటు వ్యాన్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News