- Advertisement -
న్యూఢిల్లీ: గడచిన నాలుగురోజుల్లో మూడవసారి శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసల చొప్పున పెరిగాయి. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని గత ఏడాది నవంబర్ 4వ తేదీ నుంచి నిలిచిపోయిన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మళ్లీ నాలుగు రోజుల క్రితం మొదలైంది. తాజా పెంపుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 97.81 ఉండగా డీజిల్ ధర రూ. 89.07 చేరుకుంది. 2017 జూన్‌లో రోజు వారీ పెట్రోల్, డీజిల్ ధరల సమీక్ష అమలులోకి వచ్చిన తర్వాత ఇంత హెచ్చు స్థాయిలో ధరల పెంపు ఉండడం ఇదే మొదటిసారి. మార్చి 22 నుంచి మూడుసార్లు పెరిగిన ధరలతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.2.40 పెరిగాయి.
Fuel Price hike 80 Paise for Second Day
- Advertisement -