- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో వరసగా ఏడో రోజు పెట్రో ధరలు పెరిగాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు వడ్డించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.104.44కు చేరగా, డీజిల్ రూ.93.17కు పెరిగింది. ఇక, ముంబైలో పెట్రోల్ ధర రూ.110.41, డీజిల్ దర రూ.101.03కు చేరుకుంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరిగింది. దీంతో నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.64కు చేరగా, డీజిల్ ధర రూ.101.65కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే తాజా పెంపునకు కారణమని చమురు కంపెనీలు తెలిపాయి.
Fuel Prices hiked again for 7th day
- Advertisement -