- Advertisement -
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతుంది. శనివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. లీటర్ డీజిల్‌పై 35 పైసలు, పెట్రోల్‌పై 35 పైసలు పెరిగినట్లు ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు శనివారం ప్రకటించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.94.57కు చేరుకోగా, పెట్రోల్ ధర రూ.105.84కు పెరిగింది.
ఇక, ముంబైలో పెట్రోల్ ధర రూ.111.77కు, డీజిల్ ధర రూ.102.52కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.3కు, డీజిల్ ధర రూ.97.68కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ దర రూ.110.09కు, డీజిల్ ధర రూ.103.18కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే తాజా పెంపునకు కారణమని చమురు కంపెనీలు తెలిపాయి.
Fuel Prices hiked Again in India
- Advertisement -