- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలుపై 35 పైసలు, డీజిల్‌పై కూడా 35 పైసలు వంతున ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.106.19, లీటర్ డీజిల్ రూ.94.92కు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.112.11, లీటర్ డీజిల్ రూ.102.89, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.78, లీటర్ డీజిల్ రూ.98.03కు చేరుకుంది. దీంతో విమాన ఇంధన (ఏవియేషన్ టర్బన్ ఫ్యూయెల్ ఎటిఎఫ్ ) ధరల కన్నా పెట్రోల్ ధరలే ఎక్కువయ్యాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరిగాయి. దీంతో నగరంలో లీటర్ పెట్రోల్ రూ.110.46కు, లీటర్ డీజిల్ రూ.103.56కు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే తాజా పెంపునకు కారణమని చమురు కంపెనీలు తెలిపాయి.
Fuel Prices hiked Again in India
- Advertisement -