ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి భారీగా పెంచింది. పెరిగిన ధరలతో పెలీటర్ పెట్రోల్ ధర పాకిస్తాన్ కరెన్సీలో రూ. 330 ఎగువకు చేరుకుంది. ఇప్పటికే నిత్యావరస వస్తువుల ధరల పెరుగుదల కారణంగా జీవనం దుర్భరమైపోయిన సమామాన్య ప్రజలకు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పిడుగుపాటుకు మారింది.
పెట్రోల్‌పై రూ. 26.02, డీజిల్‌పై రూ. 17.34 పెంచుతున్నట్లు పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హఖ్ కకర్ నుంచి లభించిన ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
ఈ పెంపుతో పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలు పెట్రోల్ బంకులలో రూ. 330 ఎగువకు చేరుకున్నాయని ది డాన్ వార్తాపత్రిక తెలిపింది. దేశ చరిత్రలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారని పత్రిక తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ధరలు పెపెరిగిన కారణంగా ధరలను పెంచక తప్పలేదని మంత్రిత్వశాఖ తెలిపింది. సెప్టెంబర్ 1వ తేదీన పెట్రోల్, డీజిల్‌పై రూ. 14 చొప్పున ఆపద్ధర్మ ప్రభుత్వం పెంచింది. అంతకు ముందు ఆగస్టు 15వ తేదీన హైస్పీడ్ డీజిల్‌పై లీటరుకు రూ.38.49, పెట్రోల్‌పై రూ.32.41 చొప్పున ప్రభుత్వం ధరలు పెంచింది. నెలరోజుల్లోనే పెట్రోల్‌పై రూ.58.43, డీజిల్‌పై 55.83 చొప్పున ఆపద్ధర్మ ప్రభుత్వం పెంచింది.