రూ.50 పెంచిన చమురు
సంస్థలు ఉజ్వల లబ్ధిదారులకూ
వర్తింపు పెట్రోలు, డీజిల్‌పై
ఎక్సైజ్ సుంకం రూ.2 పెంపు
ఈ భారం వినియోగదారులపై
పడదని ఆర్థికశాఖ వివరణ
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలెండర్లు,పెట్రోల్, డీజిల్ పై వడ్డింపు మొదలైంది. ప్రభుత్వం సోమవారం ఎల్ పిజి ధరను రూ. 50 పెంచింది. ఉజ్వల వినియోగదారులతో పాటు, సాధారణ ప్రజలకూ కూడా గ్యా స్ సిలెండర్ ధర పెరుగుతుంది. అలాగే, పెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని కేం ద్ర ప్రభుత్వం 2 రూపాయలు పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ 8 నుంచే అమలు లో కి వస్తాయి. ఉజ్వల పథకం లబ్ది దారుల కు ప్రస్తుతం రూ. 500 గా ఉన్న గ్యాస్ సిలిండర్‌కు ఇక రూ. 550 చెల్లించాలి. అలాగే సాధారణ వినియోగ దారులకు ప్రస్తుతం 803 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్‌కు ఇక 853 రూపాయలు చె ల్లించాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ప్రస్తుతం గ్యాస్ సిలెండర్ కు రూ. 855 రూపాయలు చెల్లిస్తున్న వినియోగదారులుఇక రూ. 905 చెల్లించవలసి ఉం టుం ది.కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ ర్దీప్ పురి ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక ముందు ప్రతి 2,3 వారాలకు ఒక సారి ప్రభుత్వం వంటగ్యాస్ సిలెండర్ ల ధరలను సమీక్షించి తగిన నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏటా 43 వేల కోట్ల రూపాయలు నష్ట పోతున్న కారణంగానే ఎల్ పిజీ ధరలు పెంచవలసి వచ్చినట్లు హర్దీప్ పురి వివరించారు.
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రప్రభుత్వం 2 రూపాయలు పెంచింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని రెవెన్యూ విభాగం ఓ నోటిఫికేషన్ లో ఈ విషయాన్ని ప్రకటించింది. పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 13 కు పెంచారు.అలాగే డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 10 కి పెంచారు. అయితే ఈ పెంపు వల్ల రీటైల్ ధరల పై ఎలాంటి ప్రభావం పడదని రెవిన్యూ విభాగం నోటిఫికేషన్ లో పేర్కొంది.