Friday, December 20, 2024

నైజీరియాలో ఘోర ప్రమాదం.. 48 మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంధన ట్యాంకర్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో దాదాపు 48 మంది సజీవ దహనమయ్యారని ఆ దేశ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ వెల్లడించింది. నైజీరియాలోని ఉత్తర-మధ్య నైజర్ రాష్ట్రంలోని అగాయ్ ప్రాంతంలో ఆదివారం ఇంధన ట్యాంకర్ మరో ట్రక్కును ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. అయితే.. ట్రక్కులో పశువులను రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో 50 జంతువులు కూడా చనిపోయాయని తెలిపింది.

ఘటనాస్థలంలో ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా-అరబ్ చెప్పారు. మొదట.. సంఘటనాస్థలంలో 30 మృతదేహాలు కనుగొనబడ్డాయని, కానీ తరువాత మరో 18 మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారని బాబా-అరబ్ చెప్పారు. దీంతో మృతదేహాలకు సామూహిక ఖననం చేశామని తెలిపారు. భారీ ఎత్తున పేలుడు సంభవించడంతో మరణాల సంఖ్య అవకాశం ఉందని.. ఎంత మంది గాయపడ్డారనే విషయంపై స్పష్టత లేదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News