Saturday, November 23, 2024

తాజా భూకంపంతో మరింత దెబ్బతిన్న జపాన్ ఫుకిషిమా అణు విద్యుత్ కేంద్రం!

- Advertisement -
- Advertisement -

Fukushima Nuclear power plant in Japan further damaged by Earthquake!

 

ఇప్పటికే దెబ్బతిన్న రెండు రియాక్టర్లలో తగ్గిన నీటి మట్టాలు

టోక్యో: గతంలో వచ్చిన తీవ్ర భూకంపంలో భారీగా దెబ్బతిని మూతపడిన జపాన్‌లోని ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం తాజాగా వచ్చన మరో భూకంపం కారణంగా మరింతగా దెబ్బతిన్నట్లు కనిస్తోందని అధికారులు చెప్పారు. గత శనివారం ఈ ప్రాంతంలో 7.1 పాయింట్ల తీవ్రతతో వచ్చిన భూకంపం కారఃగా దెబ్బతిన్న ప్లాంట్‌లోని రెండు రియాక్టర్లలో కూలింగ్ వాటర్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోవడంతో ఇది మరోసారి దెబ్బతిని ఉండవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయని టోక్యో ఎలక్ట్రికల్ పవర్ కంపెనీ (టెప్కో)ప్రతినిధి కీసుకే మట్సువో చెప్పారు. అణు విద్యుత్ కేంద్రంలోని 1,3 యూనిట్ల రియాక్టర్లలో నీటి స్థాయిలు తగ్గిపోవడం, ప్రధాన కంటైన్‌మెంట్ గదుల్లో ఇప్పటికే జరిగిన డ్యామేజి మరింత తీవ్రమై ఉండవచ్చని సూచిస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఈ లీకేజి మరింతగా పెరిగే అవకాశముందని ఆయన చెప్పారు.

అయితే లీకయిన నీరు రియాక్టర్ బిల్డింగ్స్‌లోపలే ఉండి ఉండవచ్చని, బైటివైపు లీకేజికి సంబంధించి ఎలాంటి సంకేతాలు లేవని కూడా ఆయన చెప్పారు. 2011లో రిక్టర్ స్కీలుపై 9.1 పాయింట్ల తీవ్రతతో వచ్చినపెను భూకంపం, దరిమిలా వచ్చిన సునామీ కారణంగా అణు విద్యుత్ కేంద్రంలోని కూలింగ్ వ్యవస్థలు దెబ్బతినడం, ఫలితంగా మూడు రియాక్టర్‌లలోని అణు ఇంధన కడ్డీలు కరిగిపోయి, అణు ఇంధనం ప్రధాన కంటైన్‌మెంట్ వెసల్స్ అడుగుకు పడిపోవడం తెలిసిందే. అప్పటినుంచి దెబ్బతిన్న దెబ్బతిన్న వెసల్స్‌నుంచి కూలింగ్ వాటర్ లీకవుతూనే ఉంది. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కరిగిపోయిన అణు ఇంధనాన్ని చల్లార్చడం కోసం రియాక్టర్లలోకి అదనపు నీటిని పంప్ చేస్తున్నారు.

ఫలితంగా దానిలో నీటి స్థాయి నిలకడగా పెరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ నీటి స్థాయిలు తగ్గిపోవడంతో గతంలో జరిగిన నష్టం మరింత పెరిగి ఉండవచ్చన భయాలు వ్యక్తమవుతున్నాయి. కంటైన్‌మెంట్ వెసల్స్ అడుగున నీటి స్థాయిలు, ఉష్ణోగ్రతలను టెప్కో జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుందని మట్సువో చెప్పారు. కాగా గత శనివారం వచ్చిన భూకంపంలో180కి పైగా స్వల్ప గాయాలు కాగా, పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డం, ఇళ్లు దెబ్బతినడం, హైస్పీడ్ రైల్వే లైణ తెగిపోవడంతో పాటుగా పెద్ద ఎత్తున, విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News