Friday, December 20, 2024

నెరవేరిన ఆశ… సరికొత్త శ్వాస

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : దశాబ్ది వేడుకల్లో అవిశ్రాంత కార్యక్రమాల్లో పాల్గొంటున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళ తనతో కలిసిభోజనం చేయాలని ఆశగా ఉందని విషయం తెలియగానే చివ్వెంల మండలం జ గన్నాయక్ తండాకు చెందిన స్వాతిను తన ఇంటికి ఆహ్వానించి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. మనో ధైర్యంతో క్యాన్సర్ వ్యాధిని జయించవచ్చని ఆమెకు ధైర్యాన్నిచ్చారు.

తనకు ఒక్కసారి పోలీస్ అధికారి కావాలనే ఆశగా ఉందని మంత్రి దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆయన స్పందించి జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌కు చరవాణి ద్వారా సమాచారాన్ని వివరించారు. క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న స్వాతిని పోలీస్ అధికారిగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి భోజనం చేయడం ఆయనతో గడిపిన క్షణాలు స్వాతికి జీవితం మీద ఆశతో పాటు సరికొత్త శ్వాసను ఇచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News