Monday, December 23, 2024

పార్లమెంట్ సమావేశాల పూర్తి ఎజెండా ప్రకటించలేదు : డెరిక్ ఓబ్రెయిన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఖరారు కాని ఎజెండా సోమవారం ప్రకటించిన తరువాత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ ఇంతవరకు పూర్తి ఎజెండాను ప్రభుత్వం ప్రకటించలేదని ధ్వజమెత్తారు. కుయుక్తులు పన్ని చివర్లో ఏవో నిర్ణయాలు జాబితాలో చేర్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని విమర్శించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దేనికోసం ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారో స్పష్టం చేయలేదు. అందువల్ల డర్టీ ట్రిక్సు చేసి ఆఖరి నిమిషంలో ఏవో చేర్చాలనే దురుద్దేశంతో వారు ఉన్నట్టు తెలుస్తోందని విమర్శించారు. బుధవారం రాత్రి పార్లమెంట్ హడావుడిగా బులెటిన్ విడుదల చేసింది. చీఫ్ ఎలెక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకం, వంటివి చర్చించే అవకాశం ఉందని తెలియజేసింది. మొదటి రోజు పార్లమెంట్ 75 ఏళ ప్రస్థానం గురించి చర్చిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News