Sunday, January 12, 2025

బాక్సింగ్ డే టెస్టుకు ఫుల్ డిమాండ్

- Advertisement -
- Advertisement -

హాట్ కేకుల్లా అమ్ముడు పోయిన టికెట్లు
మెల్‌బోర్న్: భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి జరిగే బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు 15 రోజుల సమయం ఉన్నప్పటికీ తొలి రోజుకు సంబంధించిన టికెట్లలన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. మొదటి రోజు ఆటకు సంబంధించిన టికెట్లను విక్రయానికి పెట్టగా గంటల వ్యవధిలోనే అన్ని అమ్ముడైపోయాయి.

ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్‌లో వెల్లడించింది. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు రెండు టెస్టులు జరిగాయి. తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించగా, అడిలైడ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జ యకేతనం ఎగుర వేసింది. రెండో టెస్టు మ్యాచ్ డేనైట్ పద్ధతిలో నిర్వహించారు. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనూ ముగిసింది ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 1,35,012 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. కాగా, రెండు జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News