Thursday, January 23, 2025

ఇకపై బాధితులకు సంపూర్ణ న్యాయం: కొత్త న్యాయచట్టాలపై అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి రావడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. ఇకపై బాధితులకు సత్వర, వేగవంతమైన న్యాయం జరుగుతుందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల తరువాత స్వదేశీ న్యాయవ్యవస్థ అమలులోకి వచ్చింది.

ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు. వలస రాజ్యాల చట్టాల స్థానంలో భారత పార్లమెంట్ రూపొందించిన ఈ చట్టాలు ఎన్నో రకాలుగా ఆలోచించి తెచ్చినవి. ఈ చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న పోలీస్‌ల హక్కులతోపాటు బాధితుల, ఫిర్యాదుదారుల హక్కులు కూడా రక్షించబడతాయి ” అని షా వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News