- Advertisement -
డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని మంచిర్యాల జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారంలో ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. మహిళల కోసం సిఎం కెసిఆర్ కొత్త పథకం తీసుకువస్తున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తామని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు మూడు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికి రూ. 5 లక్షల జీవిత బీమా అందిస్తామన్నారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో కెటిఆర్ వరస సభల్లో పాల్గొంటున్నారు.
- Advertisement -