- Advertisement -
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అవసరమైన సమయంలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) రిషబ్ పంత్‌కు అండగా నిలుస్తోంది. బోర్డు అతని వైద్య అవసరాలు మాత్రమే కాకుండా అతని వాణిజ్య ప్రయోజనాలను కూడా చూసుకుంటుంది. దాదాపు ఆరు నెలల పాటు పంత్ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. పంత్ ఐపీఎల్-2023 ఆడకపోయినా, రూ.16 కోట్ల వేతనం చెల్లించాలంటూ ఢిల్లీ క్యాపిటల్స్ కు బిసిసిఐ ఆదేశించింది. ఇది మాత్రమే కాకుండా సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీ-ఏ లో ఉన్న పంత్ కు ఏడాదికి రూ.5 కోట్లు జీతం అందించనుంది.
- Advertisement -