Monday, December 23, 2024

జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పూర్తి స్థాయి చర్యలు

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్ : జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధింత శాఖల ఆధికారులు సమన్వయంతో పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్‌భాజ్‌పాయ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందీరంలో ఈ నెల 26 న మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కారించుకొని నిర్వహించవలసిన కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 26 వ తేదిన జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి పాఠశాల, కళాశాలలో మాదకద్రవ్యాల వలన కలిగే నష్టాలపై విద్యార్థులకు వివరించాలని, జిల్లా కేం ద్రంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించాలని తెలిపారు. వ్యాసరచన పోటిలు నిర్వ హిం చాలని, మారుమూల గ్రామాలలో విద్యార్థులు పోగాకు ఉత్పత్తులకు అలావాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

ఈ నెల 26 న నిర్వహించే ర్యాలీ, అవగాహన కార్యక్రమాలలో జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు, మండల స్థాయిలో ఆయా మండలాల అధికారులు పాల్గోనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి ్ద అధికారి మణెమ్మ, జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి, జిల్లా వ్యవసాయ ఆధికారి, ఎస్సీ కార్పోరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News