Saturday, December 21, 2024

పొలిటికల్ ఫైట్‌కు ఇక ఫుల్‌స్టాప్

- Advertisement -
- Advertisement -
స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ రాజయ్య, ఎంఎల్‌సి కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధానికి అధిష్టానం తెర
కెటిఆర్‌తో రాజయ్య భేటీ, క్రమశిక్షణ మీరొద్దని ఆదేశం
ఇక శ్రీహరిపై వ్యాఖ్యలు చేయను : రాజయ్య

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) లో పెరుగుతున్న అసంతృప్తి స్వ రాలను కట్టడి చేసేందుకు కెటిఆర్ రంగంలోకి దిగారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధి లో సీనియర్ నేతల నడుమ జ రుగుతున్న మాటల యుద్ధానికి తెరదించారు. కడియం శ్రీహరిపై అనుచిత వ్యా ఖ్యలు చేసిన రాజయ్యను కెటిఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించారు. ప్ర గతి భవన్‌లో తాటికొండ రాజయ్య తో కెటిఆర్ మాట్లాడారు. కడియం శ్రీహరిపై చేస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. కడియం బహిరంగంగా పెద్దగా విమర్శలు చేయనప్పటికీ ఎందుకు పార్టీకి నష్టం జరిగేలా మాట్లాడుతున్నారని రాజయ్యను కెటిఆర్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా రాజయ్య వర్సెస్ కడియం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయపరంగానే కాదు, వ్యక్తిగత విమర్శలూ ఇందులో చోటు చేసుకుంటున్నాయి.

ఈ తరుణంలో పార్టీ పరువును బజారుకీడ్చడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలను కెసిఆర్ సీరియస్ గా తీసుకున్నారు. పరిస్థితి చక్కదిద్దాలని కెటిఆర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంలో రాజయ్యను మందలించిన కెటిఆర్, ఇంకోసారి అలాంటి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లుగా చెబుతున్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడకూదని, ఎవరూ ఆ పని చేసినా సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ఇద్దరి వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది. ఇంతటితో ఈ వివాదం ముగించాలని, ఎన్నికల సమయం దగ్గరపడుతోంది కాబట్టి ఇద్దరూ కలిసి పని చేసుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కెటిఆర్ రాజయ్యను హెచ్చరించినట్లు సమాచారం.

కెటిఆర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కడియం శ్రీహరిని కించపర్చేలా వ్యాఖ్యలు చేయలేదని కెటిఆర్‌కు వివరించానన్నారు. కడియం శ్రీహరి తల్లిని అవమానించేలా తాను వ్యాఖ్యలు చేయలేదని రాజయ్య తెలిపారు. కడియం శ్రీహరి అహంతో ప్రతి రోజూ తనపై విమర్శలు చేస్తుంటారన్నారు. ఈ విషయాలన్నీ తాను కెటిఆర్ దృష్టికి తీసుకు వచ్చినట్టుగా రాజయ్య వివరించారు. తనను కడియం శ్రీహరి ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తారో కూడ కెటిఆర్‌కు వివరించినట్టుగా పేర్కొన్నారు.. అయితే పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేయాలని కెటిఆర్ సూచించారన్నారు. ఇతర విషయాలన్నీ తమకు వదిలేయాలని కెటిఆర్ సూచించారని రాజయ్య చెప్పారు. రానున్న రోజుల్లో కడియం శ్రీహరిపై వ్యాఖ్యలు చేయకుండా ముందుకు వెళ్తానని రాజయ్య చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News