Monday, December 23, 2024

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంపూర్ణ మద్దతు: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలో తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కేంద్ర మంత్రి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశం చేరుస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొలోజు రవి, ట్రెజరర్ చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్ దండ రామకృష్ణ, సలహాదారు కె.విక్రమ్ రెడ్డి, ప్రేమ్ రాష్ట్ర కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈసందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇది న్యాయబద్ధమైన డిమాండ్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జేహెచ్‌ఎస్ అధ్యక్షుడు బొల్లోజు రవి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు, వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని, ఆ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News