Monday, January 20, 2025

రాబోయే ఎన్నికల్లో ప్రజా ఏక్తా పార్టీకి సంపూర్ణ మద్దతు

- Advertisement -
- Advertisement -

గోషామహల్: ప్రతిభావంతులైన కళాకారులు, నటీనటుల ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బో నాల శ్రీనివాస్ అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో పాటు తాజాగా హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న చరణ్ బుధవారం మహరాజ్‌గంజ్‌లోని ప్రజా ఏక్తా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా చరణ్‌ను పూలమా ల, శాలువాలతో బోనాల శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా చరణ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ప్రజా ఏక్తా పార్టీకి తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మణికంఠ శర్మ, రేనుకుంట్ల ముఖేష్ మేరు, మిద్దెల నరేష్‌గౌడ్, దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News